కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందనే వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందన
- త్వరలోనే కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందన్న షిండే
- షిండే వ్యాఖ్యలను ఖండించిన శరద్ పవార్
- కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం కాదంటూ స్పష్టీకరణ
ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్పందిస్తూ, షిండే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని... ఆయన పార్టీ గురించి ఆయన ఏమైనా చెప్పుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం కాదనే విషయాన్ని తాను స్పష్టంగా చెబుతున్నానని తెలిపారు. దీంతో షిండే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారా? అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. రెండు పార్టీలు కలిస్తేనే బీజేపీని ఎదుర్కోగలమనే ఉద్దేశంతో షిండే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.