అడవి పందిని తప్పించబోయి.. ప్రాణాలు కోల్పోయాడు!

  • కారులో పొలానికి బయల్దేరిన వినయ్ అనే వ్యక్తి
  • పందిని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొట్టిన వైనం
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వినయ్
తన వాహనానికి అడ్డుగా వచ్చిన అడవి పంది ప్రాణాలను కాపాడబోయిన ఓ వ్యక్తి... చివరకు తన ప్రాణాలనే కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ మండలం పాలమాలకులకు చెందిన వినయ్ కిశోర్ యాదవ్ అనే వ్యక్తి తన కారులో పొలానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఓ అడవి పంది కారుకు అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయి పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో వినయ్ ఒక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Go Back to Shorts
Ranga Reddy District
Shamshabad Mandal
Accident

More Telugu News