భారత్ మాతాకీ జై అనరా? అయితే మీరు పాకిస్థానీయులే!: బీజేపీ నేత సోనాలి ఫొగట్
- హర్యానా ఎన్నికల్లో అదంపూర్ నుంచి బరిలోకి దిగిన సోనాలి ఫొగట్
- భారత్ మాతా కీ జై అని నినదించని ప్రజలు
- పాకిస్థాన్ నుంచి వచ్చారా? అని మండిపాటు
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి మండిపడ్డారు. మీరంతా పాకిస్థాన్ నుంచి వచ్చారా? అని ప్రశ్నించారు. ‘‘మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది. మీరు భారతీయులైతే భారత్ మాతా కీ జై అని నినదించండి’’ అని అన్నారు. దేశం కోసం జై అనలేని మీలాంటి భారతీయులు కూడా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి ఓట్లకు విలువ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, సోనాలి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.