star maa tv: బంగార్రాజు గెటప్‌లో వచ్చిన నాగార్జున.. బిగ్‌బాస్ హౌస్‌లో సందడే సందడి

  • దసరా కావడంతో హౌస్‌లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చిన నాగ్
  • ‘బంగార్రాజు’ను చూసి ఇంటి సభ్యుల కేరింతలు
  • మిఠాయిలు, బహుమతులు అందించిన నాగ్
స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్ హౌస్‌లో వ్యాఖ్యాత నాగార్జున సందడి చేశాడు. ఇప్పటి వరకు ‘మన టీవీ’ ద్వారా హౌస్‌లోని పోటీదారులతో మాట్లాడే నాగ్.. దసరా కావడంతో మంగళవారం నేరుగా హౌస్‌లోకే వెళ్లాడు. బంగార్రాజు గెటప్‌లో హౌస్‌లోకి ఎంటరైన నాగార్జునను చూసి ఇంటి సభ్యులు ఆశ్చర్యపోయారు. నాగార్జున ఎంట్రీతో ఇంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సభ్యులను పేరుపేరునా పలకరిస్తూ హౌస్‌లో నాగ్ సందడి చేశాడు. దసరాను పురస్కరించుకుని వెంట తెచ్చిన మిఠాయిలు, బహుమతులను వారికి అందించాడు.

ఈ సందర్భంగా హౌస్‌లో ఫుడ్ మేళా నిర్వహించారు. ఇంటి సభ్యులను రెండు వర్గాలుగా విభజించిన నాగ్.. ఓ వర్గంతో చైనీస్, మరో వర్గంతో ఆంధ్రా వంటలు, స్వీట్స్ తయారు చేయించి రుచి చూశాడు. నేటి ఎపిసోడ్‌లోనూ నాగార్జున హడావుడి కనిపించనుంది.
star maa tv
big boss
reality show
Nagarjuna

More Telugu News