New Delhi: పెళ్లి వేడుకలో అత్యుత్సాహం.. తుపాకి కాల్పులతో హోరెత్తించిన యువకులు

  • ఢిల్లీలో ఘటన
  • వైరల్ అయన వీడియో 
  • యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివాహ వేడుకలో ఇద్దరు యువకుల అత్యుత్సాహం వేడుకకు హాజరైన వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఒక్కసారిగా తుపాకి శబ్దం వినిపించడంతో పరుగులు తీశారు. ఢిల్లీలోని కర్దంపురీలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లికి హాజరైన ఇద్దరు యువకులు నాటు తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పెళ్లికి హాజరైన వారు భయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసి కాల్పులు జరిపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
New Delhi
marriage
gun fire

More Telugu News