ఫ్రాన్స్ లో నేడు రాజ్ నాథ్ సింగ్ ఆయుధపూజ... తొలి రాఫెల్ జెట్ వాయుసేనకు!
- ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న రాజ్ నాథ్ సింగ్
- నేడు రాఫెల్ జెట్ డెలివరీ
- వాయుసేన కుటుంబానికి రాజ్ నాథ్ శుభాకాంక్షలు
కాగా, నిన్న రాజ్ నాథ్, రాజధాని ఫ్రాన్స్ లోని ఎలిసీ ప్యాలెస్ లో మార్కన్ తో చర్చలు జరిపారు. గడువులోగా మిగతా అన్ని యుద్ధ విమానాలనూ డెలివరీ ఇవ్వాలని ఈ సందర్భంగా రాజ్ నాథ్ కోరారు. ఇక, నేడు ఐఏఎఫ్ 87వ వార్షికోత్సవం కాగా, ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రాజ్ నాథ్, ధైర్యానికి, అంకితభావానికి వాయుసేన నిదర్శనమని, దేశానికి సేవ చేస్తున్న వాయుసేన కుటుంబానికి శుభాకాంక్షలని అన్నారు.