అంబులెన్స్ లో అయిపోయిన డీజిల్... ప్రసవ వేదనతో నిండుచూలాలు మృతి!
- మయూర్ భంజ్ జిల్లాలో దారుణం
- డీజిల్ అయిపోయి రోడ్డుపైనే ఆగిన అంబులెన్స్
- విచారణ ప్రారంభించిన ఉన్నతాధికారులు
దీంతో అంబులెన్స్ లో ఆమెను తీసుకు వెళుతుండగా, డీజిల్ అయిపోయి, అది కాస్తా రోడ్డుపై నిలిచిపోయింది. మరో అంబులెన్స్ అక్కడికి చేరుకునేందుకు గంటకు పైగా సమయం పట్టగా, ఈలోగా ఆమె ప్రాణాలు పోయాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇంధనం లేకుండా అంబులెన్స్ ను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.