98 ఓవర్లు, 9 వికెట్లు... మధ్యలో వరుణుడు!
- నేడు విశాఖలో వర్షం కురిసే అవకాశం
- హెచ్చరించిన వాతావరణ శాఖ
- దక్షిణాఫ్రికా టార్గెట్ 395 పరుగులు
ఆట సజావుగా సాగితే, మొత్తం 98 ఓవర్లు ఇండియా చేతుల్లో ఉంటాయి. దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే ఓ వికెట్ ను కోల్పోయింది. కీలకమైన ఎల్గర్ పెవీలియన్ దారి పట్టాడు మరో 9 వికెట్లను భారత బౌలర్లు తీయగలిగితే, తొలి టెస్టులో విజయం సొంతమవుతుంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే, 395 పరుగులు చేయాల్సి వుంటుంది. ఈ లక్ష్యం దాదాపు అసాధ్యమే కావడంతో, సౌతాఫ్రికా ఆటగాళ్లు డ్రా కోసమే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. నేడు ఆదివారం కావడంలో మ్యాచ్ చూసేందుకు అధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు వస్తారని అంచనా.