Tirumala: తిరుమల కాలిబాటలో భారీ రాచనాగం!

  • కాలిబాటపైకి వచ్చిన 7 అడుగుల నాగుపాము
  • చాకచక్యంగా బంధించిన భాస్కర్ నాయుడు
  • ఇటీవల పట్టుబడిన అతి పొడవైన పాము ఇదే
నిటారుగా నిలబడితే, నిలువెత్తు మనిషికన్నా పొడవైన రాచనాగం అది. దాదాపు 7 అడుగులకు పైగా పొడవుంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాటపైకి వచ్చింది. ఈ మార్గంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని ఓ దుకాణంలోకి ఇది చొరబడగా, గుర్తించిన దుకాణదారులు, టీటీడీలో పాములను పట్టడంలో నేర్పరిగా పేరున్న భాస్కర్ నాయుడికి విషయాన్ని తెలిపారు.

అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును చాకచక్యంగా పట్టుకుని, దర్గరలోనే ఉన్న అవ్వాచారి కోనలో వదిలేశారు. ఇటీవల తిరుమలగిరుల్లో పట్టుబడిన అతి పొడవైన పాము ఇదేనని భాస్కర్ వెల్లడించడం గమనార్హం.
Tirumala
Path Way
Snake

More Telugu News