TV9: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు జ్యుడిషియల్ రిమాండ్

  • నాంపల్లి కోర్టులో రవిప్రకాశ్ ను హాజరుపరిచిన పోలీసులు
  • 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన జడ్జి
  • రవిప్రకాశ్ ను చంచల్ గూడ జైలుకు తరలింపు
పద్దెనిమిది కోట్ల రూపాయలకు పైగా చీటింగ్ కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. రవిప్రకాశ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆయనను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. కాగా, రవిప్రకాశ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 9న వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.
TV9
Ex-ceo
Ravi prakash
chanchalguda jail

More Telugu News