నేను కోరిన కోరికను కనకదుర్గమ్మ తీర్చింది: రోజా
- గతేడాది జగన్ సీఎం కావాలని మొక్కుకున్నా
- కోరిక తీరడంతో తిరిగి అమ్మను దర్శించుకున్నాను
- ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా
ఈ ఉదయం సరస్వతీ దేవి అలంకారం పొందిన దుర్గమ్మను దర్శించుకున్న ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం ఇదే రోజున తాను జగన్ సీఎం కావాలని మొక్కుకున్నానని అన్నారు. తన కోరికను అమ్మ నెరవేర్చిందని చెప్పారు. తన పాలనా విధుల్లో జగన్ కు ఎటువంటి ఆటంకాలూ లేకుండా చూడాలని ఈ సంవత్సరం అమ్మను కోరానని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయని, అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేశారని అన్నారు. భక్తులు అమ్మను ప్రశాంతంగా దర్శించుకుంటున్నారని రోజా తెలిపారు.