YSRCP: సోషల్ మీడియాలో కామెంట్లపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: వైసీపీ నేత సుధాకర్ బాబు

  • తప్పుడు రాతలు రాయించింది బాబు కాదా?
  • తప్పు తేలితే రాజకీయాల నుంచి బాబు, లోకేశ్  తప్పుకోవాలి
  • జగన్ పాలనను చూసి బాబు ఓర్వలేకపోతున్నారు
సోషల్ మీడియాలో కామెంట్లపై చర్చకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమా? అని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సవాల్ విసిరారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కుటుంబంపై తప్పుడు రాతలు రాయించింది బాబు కాదా? అని ప్రశ్నించారు. తప్పు తేలితే చంద్రబాబు, లోకేశ్ లు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నారు.

చంద్రబాబు తన హయాంలో ఉద్యోగాల పేరిట యువతను నట్టేట ముంచారని విమర్శించారు. తమ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిందని, సీఎం జగన్ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరం టెండర్లు సహా చంద్రబాబు అన్నింటిలోనూ దొరికిపోయారని, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
YSRCP
Jagan
mla
sudhakarbabu
Telugudesam

More Telugu News