Vijayawada: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

  • దుర్గమ్మను దర్శించుకున్న జగన్
  • ఆలయ మర్యాదలతో జగన్ కు స్వాగతం
  • సీఎం హోదాలో తొలిసారిగా పట్టువస్త్రాల సమర్పణ
విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్ర ఘడియల్లో అమ్మవారిని దర్శించుకున్న జగన్, ప్రత్యేకపూజలు నిర్వహించారు. దర్శనానంతరం జగన్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. కాగా, ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Vijayawada
Kanakadurga
Temple
cm
jagan

More Telugu News