ఏపీకి ఎంగిలి మెతుకులు విసిరినట్టు ఇచ్చారు: కన్నాపై తులసిరెడ్డి ఫైర్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవే వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై ఇకనైనా నాటకాలు మానుకోవాలని ఏపీలోని అధికార, విపక్షాలకు సూచించారు. ఈ నేపథ్యంలో కన్నాపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. కన్నా చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పెట్టలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అప్పట్లో రాజ్యసభలో వెంకయ్యనాయుడు అడిగింది కూడా నాటకమేనా? అని నిలదీశారు.

కశ్మీర్మీ పై చూపుతున్న శ్రద్ధలో కనీసం పదో వంతైనా ఏపీపై చూపాలని తులసిరెడ్డి అన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ. 24,350 కోట్లు ఇవ్వాల్సి ఉంటే... ముష్టి వేసినట్టు రూ. 1,050 కోట్లు ఇవ్వడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు రూ. 5 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటే... ఎంగిలి మెతుకులు విసిరినట్టు రూ. 16 వేల కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.
Go Back to Shorts
Tulasi Reddy
Andhra Pradesh
Special Status
Kanna
Congress
BJP

More Telugu News