Chandrababu: ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన చంద్రబాబు

  • నరేంద్ర సింగ్ తోమర్ కు చంద్రబాబు లేఖ
  • ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను చెల్లించాలని విన్నపం
  • వైసీపీపై లేఖలో ఆరోపణలు చేసిన చంద్రబాబు
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీకి రావాల్సిన ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపులు చేయాలని లేఖలో కోరారు. ఉపాధి హామీ పథకాన్ని 2014-19 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పారు. రూ. 1,845 కోట్ల పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా... దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇంకా జోడించలేదని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం నియమనిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని, నిధులను దారి మళ్లిస్తోందని తెలిపారు.
Chandrababu
Narendra Singh Tomar
Telugudesam
YSRCP

More Telugu News