Botsa Satyanarayana: వాళ్ల సోకులకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు: గత ప్రభుత్వంపై బొత్స విసుర్లు

  • రాష్ట్రాన్ని దోచుకుతిన్నారంటూ వ్యాఖ్యలు
  • అప్పులు మిగిల్చారంటూ ఆరోపణ
  • రహదారులపై ఉండే అనాథల కోసం షెల్టర్ల ఏర్పాటు చేస్తామన్న మంత్రి 
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఏ ఫంక్షన్ నిర్వహించినా ప్రకటనలకు, స్నోలు, పౌడర్లు, సోకులకు కోట్ల రూపాయలు దుబారా చేశారని ఆరోపించారు. తాను చేపట్టిన పురపాలక శాఖ విషయానికొస్తే, తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి రూ.15 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. భారీగా బకాయిలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుభవజ్ఞులమని చెప్పుకుంటూ ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. ఇక, రహదారులపై ఉండే అనాథల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు.
Botsa Satyanarayana
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News