Chandrababu: చంద్రబాబు ఖాళీ పాత్ర ఇచ్చారు.. వైసీపీది అక్షయపాత్ర: మంత్రి నారాయణస్వామి

  • గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారంటూ చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారు
  • కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ను చంద్రబాబు ఇబ్బంది పెట్టారు
  • వైసీపీ పాలనలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి ఖాళీ పాత్ర ఇచ్చిపోయారని మంత్రి నారాయణస్వామి అన్నారు. అయితే, వైసీపీ అక్షయపాత్ర కావడంతో అన్ని పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారంటూ చంద్రబాబు అవాస్తవాలను మాట్లాడుతున్నారని, నిన్న మద్యం ఏరులై పారిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ను చంద్రబాబు ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. టీడీపీ పాలనలో పోలీస్ శాఖ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, కానీ వైసీపీ పాలనలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు.
Chandrababu
narayanaswamy
Telugudesam
ysrcp

More Telugu News