Nara Lokesh: వైఎస్ జగన్ గారూ, చేతకాని వాళ్లకు నోరు ఎక్కువంటారు... వీళ్లను చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం: లోకేశ్ విమర్శలు

  • జగన్ పై లోకేశ్ ట్వీట్
  • తన ట్వీట్ కు వీడియో జోడించిన లోకేశ్
  • వైసీపీ నేతల అసహనం చూడండంటూ వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ మీడియా చానల్ లో గ్రామ సచివాలయాల ఏర్పాటుపై చర్చ సందర్భంగా వైసీపీ నాయకుడు రెచ్చిపోయి మాట్లాడుతున్న వీడియోను లోకేశ్ తన ట్వీట్ లో ఉదహరించారు. "వైఎస్ జగన్ గారూ, చేతకానివాళ్లకు నోరు ఎక్కువంటారు. మీ తుగ్లక్ పనులను ఎలా సమర్థించుకోవాలో అర్థంకాక, మీ పార్టీ అధికార ప్రతినిధులు కిందామీదా పడుతున్నారు. టీవీలో తమను ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ల మాటలకు గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News