love: ప్రేమికురాలిని కత్తితో పొడిచి.. ప్రియుడి ఆత్మహత్య!

  • ఏడాదిన్నరగా సాగుతున్న ప్రేమ వ్యవహారం
  • ఫుల్‌స్టాప్ పెడదామన్న ప్రేమికురాలు
  • కసిదీరా పొడిచి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
తమ ప్రేమకు కటీఫ్ చెప్పాలనుకున్న యువతిని ప్రేమికుడు దారుణంగా పొడిచాడు. అనంతరం తన మణికట్టుపై గాయం చేసుకుని పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని కురార్ ‌ప్రాంతంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అంబేద్కర్‌నగర్‌లోని ఎస్ఆర్ఏ బిల్డింగ్‌లో నివసిస్తున్న యువతి వద్దకు వెళ్లిన ప్రేమికుడు (24) ఆమెతో కాసేపు ప్రేమగా మాట్లాడాడు. అనంతరం వెంట తీసుకెళ్లిన కత్తితో ఆమెను పొడిచాడు. ఆపై తన మణికట్టును కోసుకుని పదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

అప్రమత్తమైన స్థానికులు అపస్మారకస్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఏడాదిన్నరగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని యువతి భావించింది. ఇదే విషయాన్ని యువకుడికి చెప్పడంతో అతడు ఈ దారుణానికి తెగబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
love
Maharashtra
suicide
Crime News

More Telugu News