ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్‌శర్మ
- 174 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్
- మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా సెంచరీ చేసిన రోహిత్
- విశాఖ టెస్టులో ఘనత
సంయమనంతో ఆడుతూ అడపాదడపా బంతులను బౌండరీలకు తరలిస్తూ, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 174 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 12 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్‌గా సెంచరీ సాధించిన మొట్టమొదటి భారత ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు.