Hyderabad: మరోసారి తడిసి ముద్దయిన హైదరాబాద్ నగరం

  • కొన్నిరోజుల క్రితమే కుంభవృష్టి
  • అత్యధిక వర్షపాతం నమోదు
  • తాజాగా భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్నిరోజుల క్రితమే భారీ వర్షాలు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేశాయి.  తాజాగా నేడు మరోసారి హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. అబిడ్స్, కోఠి, నారాయణగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, అఫ్జల్ గంజ్, నాంపల్లి ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
Hyderabad
Rains
Telangana

More Telugu News