Andhra Pradesh: కరెంటు కోతల నేపథ్యంలో.. జగన్ సర్కారుపై పవన్ కల్యాణ్ సెటైర్!

  • ఏపీలో తగ్గిన థర్మల్ విద్యుత్ ఉత్పాదన
  • రాష్ట్రంలో కరెంటు కోతలు
  • ట్విట్టర్ లో స్పందించిన జనసేనాని
ఏపీలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా స్పందించారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయని, థర్మల్ విద్యుత్ ఉత్పాదన తగ్గడంతో కరెంటు కోతలు తప్పడంలేదని ఏపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "క్షమించాలి, మా పనయిపోయింది" అంటూ ఏపీ సర్కారు ప్రజలకు ఈ విధంగా చెబుతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, జాతీయ మీడియాలో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్ ను కూడా ట్వీట్ చేశారు. 'క్షీణించిపోతున్న బొగ్గు నిల్వలు: తెలంగాణ సీఎంను సాయం కోరిన జగన్' అంటూ ప్రచురితమైన కథనాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Andhra Pradesh
Jagan
Pawan Kalyan
Telangana
KCR

More Telugu News