నిర్మాతగా చరణ్ చేతికి మరో భారీ ప్రాజెక్ట్
- మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
- మోహన్ లాల్ క్రేజ్ పెంచిన సినిమా
- తెలుగు హక్కులు చరణ్ చేతికి
మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని దక్కించుకుంది. మోహన్ లాల్ స్థాయిని మరింతగా పెంచిన చిత్రంగా నిలిచింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును కూడా ఆయన చిరంజీవితోనే చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.