Godavari: గోదావరి జలాలు పోలవరం నుంచి మళ్లిస్తేనే ఏపీకి ప్రయోజనం... సీఎం జగన్ కు విశ్రాంత ఇంజినీర్ల సంఘం లేఖ

  • గోదావరి జలాల తరలింపుపై ఏపీ సర్కారుకు సూచనలు
  • ప్రతిపాదన విరమించుకోవాలని స్పష్టీకరణ
  • దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోయవద్దని హితవు
ఏపీ సీఎం జగన్ కు నవ్యాంధ్ర రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం లేఖ రాసింది. గోదావరి జలాల తరలింపుపై పలు సూచనలు చేశారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలోకి ఎత్తిపోయవద్దని రిటైర్డ్ ఇంజినీర్లు తమ లేఖలో పేర్కొన్నారు. పోలవరం నుంచి మళ్లిస్తేనే ఏపీకి ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. గోదావరి జలాలను దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోసే ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం జగన్ కు విశ్రాంత ఇంజినీర్లు సూచించారు.
Godavari
Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News