Chandrababu: చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు: బొత్స

  • గ్రామ సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామన్న బొత్స
  • గోదావరిలో బోటు వెలికితీత కష్టంగా మారిందని వెల్లడి
  • దురదృష్టకర ఘటనలను చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని అసహనం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినా ఆరోపణలు చేయడం అర్థరహితమని అన్నారు. 300 అడుగుల లోతున గోదావరిలో మునిగిన బోటును వెలికితీయడం కష్టంగా మారిందని, దాన్ని కూడా ప్రభుత్వ అసమర్థత కింద విమర్శలు చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే అది చంద్రబాబు అసమర్థతేనా? అని ప్రశ్నించారు. దురదృష్టకర ఘటనలను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
Chandrababu
Botsa Satyanarayana
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News