Chandrababu: 2015లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది చంద్రబాబే: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబుని మళ్లీ గోబెల్స్ ఆత్మ ఆవహించింది
  • నిజం మాట్లాడటమే మర్చిపోయారు
  • రద్దయిన జీవోను తిరిగి కేన్సిల్ చేయడమేంటని ప్రశ్నిస్తారా?
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించిన జీవోను వైసీపీ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను తమ హయాంలో రద్దు చేశామని, మళ్లీ ఇప్పుడు రద్దు చేయడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబునాయుడిని మళ్లీ గోబెల్స్ ఆత్మ ఆవహించిందని, నిజం మాట్లాడటమే మర్చిపోయారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతినిస్తూ 2015 నవంబరు 5న జీవో నంబర్ 97 జారీ చేసింది చంద్రబాబే అని, రద్దయిన జీవోను తిరిగి క్యాన్సిల్ చేయడమేంటని ఆయన ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Chandrababu
Telugudesam
YSRCP
Vijayasai reddy

More Telugu News