కేసీఆర్ చేతిలో జగన్ కీలుబొమ్మలా మారారు: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు
- శ్రీవారికి ఆయనతో కలిసి పట్టువస్త్రాల సమర్పణ ఏమిటి?
- టీటీడీని కూడా తెలంగాణకు అప్పజెబుతారేమో
- ఎంత మిత్రత్వం ఉన్నా ఏపీ హక్కులు కాలరాస్తారా?
గోదావరి జలాల తరలింపు కూడా ఏపీ భూభాగం నుంచే జరగాలని, వైకుంఠ బ్యారేజీ నిర్మాణం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. అలాకాకుండా దుమ్ముగూడెం నుంచి వయా నల్గొండ మీదుగా నాగార్జున సాగర్‌కు తరలిస్తే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. గోదావరి నీటి విషయంలో ప్రజా ఉద్యమం తప్పదని, కావేరీ జలాల పోరాటం ఇక్కడ కూడా జరుగుతుందని అన్నారు.