Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమన్నాకు చాక్లెట్ల పిచ్చి!
  • చిరంజీవి సినిమాకు దేవిశ్రీ 
  • మరో చిత్రానికి నాని ఓకే
*  తనకు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. 'చిన్నప్పటి నుంచీ నాకు చాక్లెట్ల పిచ్చి ఎక్కువ. ఇప్పటికీ కనిపించాయంటే వదలను. షూటింగ్ అప్పుడు కూడా చాక్లెట్లు లాగిస్తుంటా. అయితే, అలా తిన్నప్పుడు కాస్త వ్యాయామం ఎక్కువ చేస్తా' అని చెప్పింది.  
*  చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం. ఇక ఇందులో కాజల్ కథానాయికగా నటించే అవకాశం వుంది.
*  ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' చిత్రాన్ని చేస్తున్న హీరో నాని తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పాడు. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. శివ చెప్పిన కథకు నాని ఓకే చెప్పినట్టు సమాచారం.
Thamanna
Chiranjivi
Koratala Shiva
Nani

More Telugu News