Adi Saikumar: 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' విడుదల తేదీ ఖరారు

  • ఆది సాయికుమార్ నుంచి 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
  • ప్రతినాయకుడిగా అబ్బూరి రవి 
  • అక్టోబర్ 18న విడుదల
సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రూపొందింది. శషా ఛెత్రి .. నిత్య నరేశ్ కథానాయికలుగా  కనిపించనున్నారు. రావు రమేశ్ .. వినాయకుడు .. పార్వతీశం ముఖ్య పాత్రలను పోషించారు. కశ్మీర్ పండిట్ల జీవితాలను .. వాళ్లు ఎదుర్కునే పరిస్థితులను ఈ సినిమాలో కళ్లకు కట్టారట.

ఈ సినిమాలో తను ఎన్.ఎస్.జి. కమెండోగా కనిపిస్తాననీ, తన లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆది సాయికుమార్ అన్నాడు. "శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న అబ్బూరి రవి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తారు. నటుడిగా కూడా ఆయన బిజీ అయ్యేలా ఈ సినిమా చేస్తుంది. ఈ సినిమా టీమ్ అంతా కూడా నిర్మాణ భాగస్వాములు కావడం విశేషం. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చాడు.
Adi Saikumar
Nithya Naresh

More Telugu News