Ravi Shastri: పంత్ పై ఒత్తిడి తెస్తున్నామన్నది అవాస్తవం: రవిశాస్త్రి

  • వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్
  • పంత్ ను టీమ్ మేనేజ్ మెంట్ మందలించిందంటూ వార్తలు
  • కొట్టిపారేసిన టీమిండియా కోచ్ రవిశాస్త్రి
కొన్నాళ్ల కిందట రిషబ్ పంత్ ఓ సంచలనంలా జట్టులో ప్రవేశించాడు. టీమిండియాకు దూకుడైన వికెట్ కీపర్ దొరికాడని అందరూ సంబరపడ్డారు. తాజాగా పంత్ ఫామ్ చూస్తే నిరాశే మిగులుతుంది. నిర్లక్ష్యంగా షాట్లు కొట్టి అవుటవడం పరిపాటిగా మారింది. దాంతో టీమిండియా కెప్టెన్, కోచ్ పంత్ ను మందలించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, కోచ్ రవిశాస్త్రి వివరణ ఇచ్చారు. పంత్ పై తాము ఒత్తిడి తెస్తున్నామన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. టీమ్ మేనేజ్ మెంట్ అతడిని ఎంతో ప్రోత్సహిస్తుందని, మ్యాచ్ లు ఆడేకొద్దీ అనుభవంతో నేర్చుకుంటాడని భావిస్తున్నామని వివరించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఆడుతుంటే చెప్పడానికే తానున్నానని, అంతే తప్ప తబలా వాయించడానికి కాదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Ravi Shastri
Rishabh Pant
India
Cricket

More Telugu News