KTR: కేటీఆర్ ఓ బచ్చా.. గుత్తాపై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • అయ్య ఇచ్చిన పదవితో విర్రవీగుతున్నారు
  • హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దే గెలుపని చెబుతున్నారు
  • కాంగ్రెస్ నేతలను ఎందుకు కొంటున్నారో చెప్పాలి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ బచ్చా అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయ్య ఇచ్చిన పదవితో విర్రవీగుతున్నారని అన్నారు. హూజూర్ నగర్ లో ఏం చేశారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ దే గెలుపని చెప్పుకుంటున్న కేటీఆర్... కాంగ్రెస్ నేతలను ఎందుకు కొంటున్నారో కూడా చెప్పాలని అన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పే ఎన్నిక అని చెప్పారు. టీఆర్ఎస్ లో చేరాలంటూ కాంగ్రెస్ నేతలను ఒత్తిడి చేస్తూ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని... ఆయనపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డబ్బు, మద్యం, అధికారంతో టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తోందని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు.
KTR
Uttam Kumar Reddy
Gutha
Tamilisai
TRS
Congress

More Telugu News