వర్షపు నీటితో నిండిన హైదరాబాద్ రోడ్లు.. నీటిలో పడుకుని నిరసన తెలిపిన కార్పొరేటర్
- గ్రీన్ మిడోస్ కాలనీలోకి వర్షపు నీరు
- అవస్థలుపడిన స్థానికులు
- పరిష్కరించాలని కోరుతూ వినూత్న నిరసన చేపట్టిన కార్పొరేటర్
దీంతో వారు ఆ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వర్షపు నీటిలో పడుకుని నిరసన తెలిపారు. కాగా, తిరుమల్ రెడ్డి గతంలోనూ ఇలానే వినూత్నంగా నిరసన తెలిపి వార్తల్లోకి ఎక్కారు. రోడ్లపై చెత్తను శుభ్రం చేస్తూ, నాలాల్లో చెత్తను తొలగిస్తున్న ఆయన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.