జగన్... మీరు మరో స్టిక్కర్ సీఎం కావద్దు: కన్నా లక్ష్మీనారాయణ

  • రైతులకు రూ. 12,500 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు
  • మోదీ ఇస్తున్న రూ. 6 వేలను కలుపుకుని రైతు భరోసాగా ఇచ్చేందుకు యత్నిస్తున్నారు
  • రైతు భరోసాకు మోదీ పేరు పెట్టండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. పంటలు వేసే సమయానికి మే నెలలో రైతులకు రూ. 12,500 ఇస్తామని మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించిందని కన్నా గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రైతులకు మోదీ ఇస్తున్న రూ. 6,000లను కలుపుకుని 'వైయస్సార్ రైతు భరోసా'గా రైతులకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి మీరు కూడా స్టిక్కర్ వేయడం తప్పని అన్నారు. మీరు మరో స్టిక్కర్ సీఎం కావద్దని ఎద్దేవా చేశారు. రైతు భరోసాకు మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Go Back to Shorts
Jagan
Kanna
Narendra Modi
Chandrababu
YSRCP
BJP
Telugudesam

More Telugu News