Chandrababu: ఇవన్నీ వైసీపీ వాళ్లకు దున్నపోతుమీద వాన చినుకులు లాంటివే!: చంద్రబాబునాయుడు

షార్ట్స్‌లో చూడండి
విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై పున:సమీక్షకు దిగడం సరికాదని సూచిస్తూ ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మరోమారు లేఖ రాశారు. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

కేంద్రం చీవాట్లు, కోర్టుల మొట్టికాయలు ఏవైనా, వైసీపీ వాళ్లకు దున్నపోతు మీద వాన చినుకులు పడినట్టే అని సెటైర్లు విసిరారు. పీపీఏల రద్దుపై కేంద్ర మంత్రి లేఖలు, కేంద్ర కార్యదర్శి లేఖలు, ఆర్ బీఐ.. ఇలా ఎందరు హెచ్చరికలు చేసినా అన్నింటినీ పెడచెవిన పెట్టారని విమర్శించారు.

తాజాగా, పీపీఏల రద్దుపై ప్రభుత్వాన్ని మూర్ఖంగా ముందుకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ లేఖ రాశారని అన్నారు. మూడు కంపెనీలకు తెలుగుదేశం ప్రభుత్వం దోచిపెట్టిందన్న వైసీపీ నేతల ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రుజువులతో సహా ఆ లేఖలో తెలిపారని పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
cm
Jagan
PPA

More Telugu News