Andhra Pradesh: ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

  • ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి
  • ఎన్నడూ లేని విధంగా అట్టడుగు స్థాయికి చేరాయి
  • ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలి
ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రెండు పేజీల లేఖ రాశారు. ఎన్నడూ లేని విధంగా శాంతిభద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని, వాక్ స్వాతంత్య్రంను  హరిస్తున్నారని, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఈ లేఖలో ఆరోపించారు.

ప్రజలు, మీడియా ప్రతినిధులపై వరుస దాడులు జరుగుతున్నాయని, సంఘ విద్రోహశక్తుల ద్వారా శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని, చీరాలలో విలేకరిపై ఆమంచి వర్గీయులు దాడి చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో ఏపీ పోలీసులకు ‘సమర్థులు’ అనే పేరు ఉండేదని, కొన్నాళ్లుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే పేరు వచ్చిందని ఆరోపించారు. ఏపీలో ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని తన లేఖలో చంద్రబాబు కోరారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
DGP

More Telugu News