Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' విడుదల విషయంలో మహేశ్ బాబు సూచన

  • సంక్రాంతి బరిలో భారీ సినిమాలు 
  • జనవరి 10న రజనీ 'దర్బార్'
  • జనవరి 12వ తేదీన బన్నీ మూవీ  
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు తాజా చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతోంది. మహేశ్ బాబు స్టైల్ .. అనిల్ రావిపూడి మార్కుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు.

సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రజనీకాంత్ 'దర్బార్' సినిమా రానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను జనవరి 11న విడుదల చేద్దామనే అభిప్రాయాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారట. మహేశ్ బాబు మాత్రం జనవరి 14న అయితే బాగుంటుందని అన్నాడట. ఈ విధంగా చేయడం వలన ఓపెనింగ్స్ బాగుంటాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడని అంటున్నారు. ఈ విషయంపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
Mahesh Babu
Rashmika

More Telugu News