శుక్రవారం ఈడీ విచారణకు హాజరవుతా: శరద్ పవార్
- శుక్రవారం మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్తా
- నన్ను ఎవరూ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు
- నా వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీకి తెలియజేస్తా
మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు సంబంధించిన కుంభకోణం కేసులో శుక్రవారం (సెప్టెంబర్ 27) నాడు ఈడీ విచారణకు హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఈ బ్యాంకులో రూ. 25 వేల కోట్ల పెట్టుబడుల అంశంలో శరద్ పవార్ హస్తం ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ, ఈడీ విచారణకు సహకరిస్తానని, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్తానని చెప్పారు. ఎవరూ తనను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని... తనంతట తానే వెళ్తానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్నంతా ఈడీకి తెలియజేస్తానని చెప్పారు. తాను ఏ బ్యాంకు లావాదేవీల్లో పాలుపంచుకోలేదని తెలిపారు. తనకు భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
ఇదే అంశంపై శరద్ పవార్ నిన్న మాట్లాడుతూ, తనను జైలుకు పంపినా బాధపడబోనని... ఇప్పటి వరకు జైలు జీవితం ఎలా ఉంటుందో తనకు తెలియదని, జైలుకు పంపితే ఎంజాయ్ చేస్తానని అన్నారు.