హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం!

  • పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఈరోజు సాయంత్రం సుమారు గంటకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. కూకట్ పల్లి, మోతీ నగర్ రాజీవ్ నగర్, ఎర్రగడ్డ,ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
Ameerpet
Rain

More Telugu News