సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజున హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశాం: చంద్రబాబు
- ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
- హైదరాబాద్ సిటీకి ల్యాండ్ మార్క్ లా నిలిచిపోయిందని వ్యాఖ్య
- టీడీపీ అధినేతకు లోకేశ్ ప్రశంసలు
దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా స్పందించారు. చంద్రబాబునాయుడు దూరదృష్టి ఫలితమే హైటెక్ సిటీ ఆవిర్భావం అని ట్వీట్ చేశారు. సైబరాబాద్ చలవతో హైదరాబాద్ ఓ మహోన్నత నగరంగా గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడ్ని ప్రశంసించారు. ఓ నాయకుడు ప్రజలకు ఇవాళేం కావాలన్నంత వరకే ఆలోచిస్తాడని, కానీ ఓ దార్శనికుడు ఇప్పటి ప్రజలకే కాకుండా భావితరాలకు ఏది అవసరమో దాని గురించి కూడా ఆలోచిస్తాడని వివరించారు.