Hyderabad: అమీర్ పేట్ మెట్రోస్టేషన్ ఆవరణలో విషాదం.. యువతి మృతి!

  • మెట్రోస్టేషన్ పై నుంచి పెచ్చులూడి పడి యువతి మృతి
  • మృతురాలు కూకట్ పల్లికి చెందిన మౌనికగా గుర్తింపు
  • ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు 
హైదరాబాద్ లోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ ఆవరణలో విషాద సంఘటన జరిగింది. మెట్రోస్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడిపడటంతో ఓ యువతి మృతి చెందింది. ఈరోజు సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో మెట్రో స్టేషన్ మెట్ల పక్కన తన సోదరితో కలిసి ఆమె నిలబడి ఉంది. ఇదే సమయంలో, ఒక్కసారిగా స్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. తీవ్రంగా గాయపడ్డ ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు సమాచారం. మృతురాలి పేరు మౌనిక. టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఆమె పనిచేస్తోంది. మౌనికను కూకట్ పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad
Ameerpet
Metro station

More Telugu News