Team India: చివరి టి20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా

  • బెంగళూరులో మ్యాచ్
  • మ్యాచ్ కు వానముప్పు!
  • సిరీస్ గెలుపు కోసం టీమిండియా ఉత్సాహం
దక్షిణాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్ లో టీమిండియా నెగ్గింది. ఇప్పుడు మూడో టి20లో కూడా నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తుండగా, సిరీస్ సమం చేసేందుకు తమ ముందు నిలిచిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డికాక్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా భావిస్తోంది. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
Team India
Cricket
South Africa
T20

More Telugu News