Godavari: గోదావరి బోటు మునక దృశ్యాల వీడియో ఇదిగో!

  • దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం
  • మునిగిపోయిన బోటు
  • పదుల సంఖ్యలో మృతులు
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద కొన్నిరోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నింపింది. పర్యాటకులు పెద్దసంఖ్యలో మృతి చెందడంతో గోదావరి చరిత్రలో ఇదో విషాదకర ఘటనగా నిలిచిపోయింది. మునిగిపోయిన బోటును ఇప్పటికీ వెలికితీయలేకపోయారు. తాజాగా, బోటు మునకకు సంబంధించిన ఓ వీడియో మీడియాలో ప్రసారమవుతోంది. బోటు మునిగిపోతుండగా, పలువురు లైఫ్ జాకెట్ల సాయంతో ఈదుతుండడం, ఓ చిన్నపడవ వారికి సాయపడేందుకు రావడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

Godavari
East Godavari District
Bpat

More Telugu News