Sivaprasad: ఎప్పుడు పలకరించినా అన్నా, అన్నా అంటుండేవాడు: శివప్రసాద్ మరణంపై మోహన్ బాబు స్పందన

  • అనారోగ్యంతో కన్నుమూసిన శివప్రసాద్
  • శివప్రసాద్ తనకు మంచి స్నేహితుడన్న మోహన్ బాబు
  • ఎంతో ఆప్యాయంగా ఉండేవాడని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ మరణం పట్ల సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. శివప్రసాద్ తనకు మంచి స్నేహితుడు అని, ఆయన మరణం తనను బాధకు గురిచేసిందని తెలిపారు. శివప్రసాద్ తో తనకు 40 ఏళ్ల సాన్నిహిత్యం ఉందని, ఎప్పుడు పలకరించినా అన్నా, అన్నా అంటూ ఆప్యాయతానురాగాలు ప్రదర్శించేవాడని పేర్కొన్నారు. 80-90వ దశకం మధ్యలో తాను హీరోగా నటించిన 'భలేరాముడు' చిత్రంలో శివప్రసాద్ ఓ గెస్ట్ రోల్ పోషించాడని, ఇటీవల వచ్చిన 'గాయత్రి' చిత్రంలో కూడా కలిసి నటించాడని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
Sivaprasad
Mohan Babu

More Telugu News