Telugudesam: జగన్ రాజీనామా చేస్తారా? లేక పంచాయతీ, విద్యాశాఖ మంత్రులు చేస్తారా?: చంద్రబాబునాయుడు

  • గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు
  • పేపర్ లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
  • ఈ ఘటన ఏపీపీఎస్సీకే ప్రతిష్ఠకే మాయని మచ్చ
ఏపీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓ లేఖ రాశారు. గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరగడం వైసీపీ పాలన ఎంత ఘోరంగా ఉందో అద్దం పడుతుందని విమర్శించారు. గ్రామ సచివాలయ పరీక్షల పేపర్ లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రాజీనామా చేస్తారో లేక పంచాయతీ, విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఈ ఘటన ఏపీపీఎస్సీకే ప్రతిష్ఠకే మాయని మచ్చగా అభివర్ణించారు. దాదాపు 19 లక్షల మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు ఆవేదన మిగిల్చిందని విమర్శించారు.

Telugudesam
Chandrababu
cm
jagan
AP

More Telugu News