Pokiri: అమ్మాయిలను ఏడిపిస్తున్నాడని పోకిరీని చితక్కొట్టిన గ్రామస్థులు

  • బస్సులో రాకపోకల సందర్భంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు
  • బస్సు వద్ద కాపలా కాసిన ఊరిజనం
  • ఆపకపోవడంతో వెంటవెళ్లి మరీ పట్టుకుని దేహశుద్ధి
బస్సులో కళాశాలకు వెళ్తున్న అమ్మాయిల వెంటపడి మరీ వేధిస్తున్న ఓ యువకుడికి గ్రామస్థులు భలే బుద్ధి చెప్పారు. బస్సును వెంటాడి సదరు యువకుడిని బయటకులాగి దేహశుద్ధి చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.

పెద్దపల్లి మండలం రాఘవపూర్‌ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థినులు పట్టణంలో చదువుకుంటున్నారు. వీరంతా బస్సులో కళాశాలకు వచ్చి వెళ్తుంటారు. ఈ సందర్భంలో ఓ ఆకతాయి మరికొందరితో కలిసి ప్రయాణిస్తూ అమ్మాయిలను ఏడిపిస్తున్నాడు. ఇది భరించలేని స్థాయికి చేరడంతో బాధిత బాలికలు విషయం తమ వారికి తెలిపారు. వెంటనే గ్రామస్థులు ఊరివద్ద కాపుకాసి బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. బస్సు డ్రైవర్‌ నిలపకపోవడంతో వాహనాల్లో వెంటపడ్డారు. కొంతదూరం వెళ్లాక బస్సును ఆపి, సదరు యువకుడిని కిందికి దించి చితక్కొట్టారు. మళ్లీ తమ ఊరి అమ్మాయిలను వేధిస్తే తాట తీస్తామని చెప్పి వదిలేశారు.
Pokiri
school girls
herasment
villagers
manhandling

More Telugu News