Andhra Pradesh: చంద్రబాబులాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్యపోవాలి!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • ఏపీలో గ్రామ సచివాలయం రగడ
  • జగన్ సర్కారుపై టీడీపీ విమర్శలు
  • చంద్రబాబుపై సాయిరెడ్డి మండిపాటు
ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ 'ఆంధ్రజ్యోతి'లో నిన్న కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. గ్రామ సచివాలయం పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని టీడీపీ అనుకూల మీడియా పరీక్షా కేంద్రాల చుట్టూ తిరిగిందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

కానీ ఎవరూ పరీక్షల నిర్వహణ తీరును తప్పుపట్టలేదని వ్యాఖ్యానించారు. దీంతో చివరికి తానే స్వయంగా పూనుకున్న చంద్రబాబు ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇలా అంటారని ఊహించిందేనని, ఆయనలాంటి జ్ఞాని అలా అనకపోతే ఆశ్చరపోవాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబులను ట్యాగ్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News