lingamaneni guest house: పంచాయతీ అనుమతులతోనే కరకట్టపై గెస్ట్‌హౌస్ నిర్మాణం: లింగమనేని స్పష్టీకరణ
- చంద్రబాబు నివాసానికి సీఆర్‌డీఏ నోటీసులు
- దీనిపై వివరణ ఇచ్చిన ఇంటి యజమాని
- అప్పటికి సీఆర్‌డీఏ లేనందున పంచాయతీ అనుమతి
ఉండవల్లి పంచాయతీ నుంచి నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకునే కృష్ణా నది కరకట్టపై గెస్ట్ హౌస్ నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న భవన యజమాని లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. ఈ ఇల్లు అక్రమ నిర్మాణమని, వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని తాజాగా సీఆర్‌డీఏ అధికారులు లింగమనేని పేరుతో మరోసారి భవనానికి నోటీసులు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్ రూమ్ నిర్మించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
దీంతో ఇంటి యజమానిగా లింగమనేని స్పందించారు. తాము నిర్మాణం చేపట్టే నాటికి సీఆర్‌డీఏ లేదని, అందువల్ల ఉండవల్లి పంచాయతీ పరిధిలోని ఇల్లు కాబట్టి అప్పటి పంచాయతీ అనుమతి తీసుకునే నిర్మాణం చేపట్టామని తెలిపారు.
దీంతో ఇంటి యజమానిగా లింగమనేని స్పందించారు. తాము నిర్మాణం చేపట్టే నాటికి సీఆర్‌డీఏ లేదని, అందువల్ల ఉండవల్లి పంచాయతీ పరిధిలోని ఇల్లు కాబట్టి అప్పటి పంచాయతీ అనుమతి తీసుకునే నిర్మాణం చేపట్టామని తెలిపారు.