అసోంలో దారుణం.. పోలీస్ స్టేషన్లో అక్కాచెల్లెళ్లలను వివస్త్రలను చేసి చావబాదిన పోలీసులు
- వేరే మతం అమ్మాయిని ప్రేమించి తీసుకెళ్లిన యువకుడు
- పోలీసుల దాడిలో ఓ మహిళకు గర్భస్రావం
- పోలీసు అధికారి, మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్
బాధిత అక్కాచెల్లెళ్ల సోదరుడు గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. వీరివి వేర్వేరు మతాలు కావడంతో వివాదం పెద్దదైంది. దీంతో యువతి కుటుంబం చేసిన ఫిర్యాదుతో బాధిత మహిళలను, వివాహిత భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు వారిని చితక్కొట్టారు. అమానవీయంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.