Kodela: కోడెల కుమారుడు శివరామ్ ను త్వరలో ప్రశ్నిస్తాం: బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు

  • కోడెల ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది
  • ఇప్పటి వరకూ ఈ కేసులో 12 మందిని ప్రశ్నించాం
  • కోడెల ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నాం
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆయన కుమారుడు శివరామ్ ను త్వరలో ప్రశ్నిస్తామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానం ఉన్న వారందరినీ ప్రశ్నిస్తున్నామని, అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకూ ఈ కేసులో 12 మందిని ప్రశ్నించామని, కోడెల కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశామని వివరించారు. కోడెల ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నామని, సీడీఆర్ఏ కాల్ లిస్ట్ రిపోర్ట్ ను పరిశీలిస్తున్నామని అన్నారు.
Kodela
sivaprasad
Sivaram
ACP
KSRao

More Telugu News