నిబంధనల అతిక్రమణ... జనసేన అనుబంధ ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్
- 300 ఖాతాలను తొలగించిన సంస్థ
- అన్ని ఖాతాలు శతఘ్ని బృందానివే
- వైసీపీనే కారణమంటున్న జన సైనికులు
గత కొన్ని రోజులుగా జనసైనికులు ట్విట్టర్లో 'సేవ్ నల్లమల' ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఏపీ సీఎంగా జగన్ ఫెయిల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాలు సస్పెండ్ కావడంతో ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పనే అయి ఉంటుందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే, సేవ్ నల్లమల ఉద్యమం వల్ల ఖాతాలు సస్పెండ్ చేసే అవకాశం లేదని చెబుతున్నారు.